వైయస్ మృతి తర్వాత పట్టు తప్పాయి: చిదంబరం

శాంతియుతంగా ఉద్యమాలు చేయాలని, ఇతరులకు హాని కలగకుండా చూడాలని కూడా కేంద్ర మంత్రి వారికి సూచించారు. ఇటువంటి సమావేశాలు ఇంకా జరుగుతాయని ఆయన అన్నారు. తెలంగాణపై నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకుంటామని చిదంబరం తమతో చెప్పినట్లు సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ భేటీ తర్వాత మీడియా ప్రతినిధులతో చెప్పారు. శాంతిని పాటించాలని సూచించినట్లు ఆయన తెలిపారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఆరో ప్రతిపాదనను అమలు చేయాలని తాము చిదంబరాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రం విడిపోదని పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణవాదులు తమను రెచ్చగొట్టినా తాము సహనం పాటిస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications