బలవంతపు ఆధిపత్యానికి సమైక్యవాదం: కోదండరామ్

పెనుగంచిప్రోలులో తెలంగాణవారిపై జరిగిన దాడిని తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుడు స్వామిగౌడ్ ఖండించారు. అటువంటి సంఘటనలు పునరావృతమైతే బాధ్యత సీమాంధ్ర పాలకులదేనని ఆయన అన్నారు. తెలంగాణలో వేలాది మంది సీమాంధ్ర ప్రజలు నివసిస్తున్నారని, వారిపై దాడులు చేయబోమని ఆయన అన్నారు. తమపై బురదచల్లడం ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 26వ తేదీన ఉద్యోగ సంఘాలు సమావేశమై సమ్మె ఎప్పటి నుంచి చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటాయని అన్నారు. సకల జనుల సమ్మెతో తాము కలిసి సాగుతామని ఆయన చెప్పారు. కాగా, తెలంగాణ మెడికల్ జెఎసి సమ్మె నోటీసు ఇచ్చింది.












Click it and Unblock the Notifications