వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్రులతో కలిసి ఉండలేం, రెచ్చగొడుతున్నారు: విహెచ్

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumanth rao
హైదరాబాద్: సీమాంధ్ర నాయకులతో తాము కలిసి ఉండలేమని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. విడిపోతేనే అందరం అభివృద్ధి చెందుతామని ఆయన అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమం కృత్రిమమైందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. సీమాంధ్ర నాయకులు రెచ్చగొడుతుండడం వల్లనే తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన తప్పు పట్టారు. హైదరాబాదు కోసం ఎందుకు పట్టుపడుతున్నారని, ఇక్కడ బంగారమూ వెండీ ఉందా అని, గుంటూరు, విశాఖపట్నం నగరాలను అభివృద్ధి చేసుకోవచ్చు కదా అని ఆయన అన్నారు. శవాలపై రాజకీయం చేసే వైఖరి మారాలని ఆయన సూచించారు. తమ పార్టీ అధిష్టానం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్న ప్రతి తరుణంలో సీమాంధ్ర నాయకులు అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు.

తాము ముస్లిం పాలనకు అలవాటు పడ్డామని, తమకు ముస్లింల వల్ల ఏ విధమైన ప్రమాదం లేదని, తమ బాధలేవో తాము పడుతామని, సీమాంధ్రులకు ఈ విషయాలు ఎందుకని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ముస్లింలు ఆధిపత్యం వహిస్తారని, తీవ్రవాదమూ నక్సలిజమూ పెరుగుతుందని సీమాంధ్ర నాయకులు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆయన అన్నారు. 2004, 2009 ఎన్నికల్లో ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని పెట్టామని, అయినా సీమాంధ్ర ప్రజలు కాంగ్రెసు పార్టీకి ఓటేశారని, దీన్నిబట్టి సీమాంధ్ర ప్రజలు తెలంగాణను వ్యతిరేకించడం లేదని అర్థమవుతోందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం రాజ్యసభలో పోరాటం చేయడానికే తాను రాజీనామా చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

English summary
Congress Telangana Rajyasabha member V Hanumanth rao lashed out at Seemandhra leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X