బాలకృష్ణ రాజకీయాల్లో బాగా రాణిస్తారు: పరుచూరి

డ్రగ్స్ వాడే వారు అన్ని రంగాలలో ఉన్నారని ఆయన అన్నారు. అయితే సినిమా అనేది రంగుల ప్రపంచం కాబట్టి అందరి దృష్టి సాధారణంగా పడుతుందన్నారు. ప్రస్తుత రాజకీయాలు ప్రజలకు హాని కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు. రాజకీయాలు పూర్తి ధనరాజకీయంగా మారాయన్నారు. కాగా ఇటీవల బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కోసం విరాళాలు సేకరించడానికి బాలయ్య అమెరికా వెళ్లిన సమయంలో తాను రాజకీయాలలోకి త్వరలో వస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాను రాజకీయాలలోకి వచ్చినప్పటికీ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.