'అంబానీ సోదరులకు మీడియా అతి ప్రచారం'

కార్పోరేట్ ఇండియా సర్వ అవలక్షణాలకు ఆర్కామ్ ప్రతీక అని నీరజ్ వ్యాఖ్యానించాడు. ఉత్తర అమెరికాలోని తమ క్లయింట్లు అనేకమంది రిలయన్స్ కంపెనీల్లో ఇన్వెస్టు చేశారని ఆయన అంబానీ సోదరుల కంపెనీల పైకి దృష్టి మళ్లడంపై వివరించారు. కెనడాలోని అత్యంత విశ్వసనీయమైన ఇన్వెస్టుమెంట్ రీసెర్చ్ కంపెనీగా విరాటాస్‌కు పేరుందని నీరజ్ మోంగా పేర్కొన్నాడు. ఆర్కామ్, ఆర్ఐఎల్ కంటే తమ కంపెనీకి ఎక్కువ విశ్వసనీయత అంతర్జాతీయంగా ఉందని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. భారతీయ మీడియా అంబానీ సోదరులకు ఎక్కువ ప్రచారం కల్పిస్తోందని అన్నారు. వీరి వ్యాపారలలోని అక్రమాలను పట్టించుకోకుండా వారిని అందలం ఎక్కిస్తోందని ఆరోపించారు. అయితే నీరజ్ మోంగా అంటున్న కంపెనీ పేరు తాము ఎప్పుడూ వినలేదని ఆర్కామ్ అంటోందంట.












Click it and Unblock the Notifications