మేమో అడుగేశాం, ఐనా రెచ్చగొడుతున్నారు: విహెచ్

రాష్ట్రం విడిపోయినా ఎవరి వ్యాపారులు వారు చేసుకోవచ్చునని అన్నారు. స్వయం పాలన, ఉద్యోగాల కోసమే తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఎంపీ కావూరి సాంబశివ రావు వంటి సీనియర్ నేతలు అపహాస్యం చేస్తూ మాట్లాడటం సరికాదన్నారు. ఈ మధ్య రాజకీయాల్లోకి వచ్చిన వారు పోకస్ కోసం ఎగిరి పడటంలో తప్పు లేదు. కానీ గత పదేళ్లుగా ప్రత్యేకంపై నోరు మెదపని సీనియర్లు ఇప్పుడే మాట్లాడటం వెనుక అర్థం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాదుతో ఇరు ప్రాంతాల నేతలు సమస్యల పరిష్కారం కోసం మాట్లాడుతున్న సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. అధిష్టానం తెలంగాణ సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు ఎల్‌కె అద్వానీ, ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణను సీమాంద్ర నేతలు ఇప్పుడు విమర్శించడం ఎంత వరకు సమంజసం అన్నారు. వారు ఏళ్లుగా తెలంగాణకు అనుకూలమని చెబుతున్నారని అప్పుడెందుకు వారిని ప్రశ్నించ లేదన్నారు. వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్టాండును ప్రశ్నించే తెలుగుదేశం పార్టీ నేతలు ముందు ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వైఖరి తేల్చాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications