వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బళ్లారి అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టు కన్నెర్ర

గనుల తవ్వకాల వల్ల పర్యావరణానికి జరిగిన నష్టంపై నివేదిక సమర్పించాలని కూడా సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశంలోని పరిశ్రమలకు ఎంత ముడి ఇనుము అవసరమో లెక్కలు వేయాలని సూచించింది. అందులో బళ్లారి ఏ మేరకు భర్తీ చేస్తోందో కూడా చూపాలని సూచించింది. దేశంలో ఉత్పత్తి అవుతున్న ఉక్కు ఎంత ఎగుమతి అవుతుందో చెప్పాలని ఆదేశించింది. దేశంలోనే గనుల తవ్వకాలను అన్నింటినీ ఎన్‌ఎండిసికి అప్పగించే ఆలోచన చేయాలని కూడా సూచించింది. కొద్ది మంది దురాశ ప్రతి ఒక్కరినీ బాధిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.