కెసిఆర్ రెచ్చగొడుతున్నారు: లగడపాటి రాజగోపాల్

సీమాంధ్ర ప్రాంతం నుండి వెళ్లిన కెసిఆర్, విజయశాంతి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడం విశేషం అన్నారు. రెచ్చగొడితే నాయకులకు పదవులు వస్తాయి. కానీ అమాయ ప్రజలు మృతి చెందుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుపత అపోహలకు పోయి ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. తెలుగు వారిని విడదీసి కొందరు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణ కోసం యువత, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఎక్కడా నేతల పిల్లలు ఆత్మహత్యలు చేసుకోలేదన్నారు. తన దృష్టిలో తెలంగాణకు పరిష్కారం వచ్చిందన్నారు. తెలంగాణలో నాకు కోపం ఉండవచ్చు. కానీ తెలంగాణపై తాను ఎవ్వరినీ ఆశపెట్టలేదన్నారు. వలసవాదులంటే ప్రతి ఒక్కరూ వలసవాదులే అన్నారు. కేంద్రం తెలంగాణ ఇవ్వడానికి చట్టం తెస్తే అప్పుడు ఆలోచిస్తానని అన్నారు.












Click it and Unblock the Notifications