చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమలలోనూ గుప్తనిధుల తవ్వకాలు, అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tirumala Temple
తిరుపతి: కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో భారీగా గుప్త నిధులు దొరకడంతో ఇప్పుడు అందరి చూపులు దేవాలయాల పైన పడింది. ఇటీవల పలు దేవాలయాల పరిసరాల్లో, దేవాలయాల్లో కొందరు దుండగులు తవ్వకాలు జరిపిన విషయం తెలిసిందే. అయితే బుధవారం మరికొందరి కన్ను తిరుపతిలో పడింది. తిరుమలకు ఒక కిలోమీటరు దూరంలో పార్వేటి మండపం ఈతకాయల మార్గం వద్ద తొమ్మిది మంది వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. అయితే ఎర్రచందనం కోసం గస్తీ జరుపుతున్న పోలీసుల కళ్లలో వీరు పడ్డారు.

పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. మొదట ముగ్గురిని అదుపులోకి తీసుకున్నప్పటికీ ఆరుగురు తప్పించుకున్నారు. అయితే పోలీసులు వారిని వెంబడించి అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. కాగా కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి పరమ భక్తుడు అయిన అన్నమయ్య ఈ రహదారిలోనే అప్పుడు కొండ పైకి చేరినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.

English summary
Nine people dug near Tirumala for Gupta Nidhulu. Police arrested them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X