హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'బేరమాడిన తర్వాతే జగన్ పేరు ఇరికించారు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan-P Shankar Rao
హైదరాబాద్: చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర్ రావు మొదట పేర్లు లేకుండా హైకోర్టుకు రెండు లేఖలు రాశారని అయితే తనకు మంత్రి పదవి వచ్చిన తర్వాతనే జగన్ పేరు ఇరికించారని వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాది బుధవారం హైకోర్టులో చెప్పారు. జగన్ ఆస్తులపై కేసుపై బుధవారం వాదనలు సాగాయి. శంకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేరు లేకుండా రెండు లేఖలు రాసి ఆ తర్వాత తన పార్టీ అధిష్టానంతో మంత్రి పదవి కోసం బేరమాడారని ఆరోపించారు. తనకు మంత్రి పదవి వచ్చిన తర్వాతే జగన్ పేరు ఇరికించారని అన్నారు. ఇది ఉద్దేశ్య పూర్వకంగానే జరిగిందని చెప్పారు.

జగన్ ఆస్తులు అక్రమం అనడానికి ఏ ఒక్క ఆధారం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ పేరు ఉద్దేశ్య పూర్వకంగా ఇరికించారని అన్నారు. నాటి నిర్ణయాలకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఒక్కడినే లక్ష్యంగా ఎందుకు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. నాటి మంత్రివర్గంపై కేసులు ఎందుకు పెట్టలేదని జగన్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. కాగా ఉదయం వాదనల అనంతరం లంచ్ విరామం కోసం కేసును మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

English summary
Jagan's lawyer blamed minister Shankar Rao for his letters to high court. He accused that he was not write Jagan's name in first letter. Lawyer said that Shankar Rao add Jagan's name when he got ministry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X