కెసిఆర్ ప్రత్యర్థులే తెలంగాణ టిడిపి మిత్రులు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆగస్టు 6వ తేదీలోగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని కోదండరామ్ గడువు పెట్టారు. అయితే, తెలంగాణ కోసం మళ్లీ రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ నేతలతో అన్నారు. తెలంగాణలో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కెసిఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ వైఖరి మారకుంటే తెరాసను ప్రజలు తరిమికొడతారని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమానికి ఐక్య వేదిక నిర్మిస్తామని కూడా ఆయన చెప్పారు. కెసిఆర్ అందరినీ కలుపుకుని వెళ్లడం లేదనేది ఆయన ప్రధానమైన ఆరోపణ. ఈ నెల 7వ తేదీన అన్ని పార్టీలతో ఓ సమావేశం ఏర్పాటు చేయాలని తెలుగుదేశం తెలంగాణ నాయకులు నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications