చిదంబరానికి తెలంగాణ శాపం పెట్టిన కెసిఆర్

ప్రొఫెషనల్ అయిన చిదంబరం ఇంత దిక్కుమాలిన ప్రకటన చేస్తాడని అనుకోలేదని, ఆ ప్రకటన చేయడానికి కొంతైనా అభిమానం ఉండాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు సహనం కోల్పోవద్దని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసినా దిగి రాకుండా తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం కుంటిసాకులు చెబుతోందని ఆయన అన్నారు. జయశంకర్ స్ఫూర్తిగా తెలంగాణ సాధన కోసం ఉద్యమిద్దామని ఆయన అన్నారు.
సమైక్యవాదుల కుట్రలను తిప్పికొట్టే సత్తా తెలంగాణవాదులకు ఉందని పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అన్నారు.












Click it and Unblock the Notifications