కావూరిపై భగ్గుమన్న కోదండరామ్, కెటి రామారావు

Kodandaram-KT Rama Rao
హైదరాబాద్: తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావుపై తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు కెటి రామారావు విడివిడిగా భగ్గుమన్నారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెసు హామీ ఇవ్వలేదన్న కావూరిపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. తెలంగాణపై ఏకాభిప్రాయం కావాలని చెప్పిన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన అర్థరహితమని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై హామీ ఇస్తే శాంతియుత ప్రదర్శనలు చేస్తామని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణకు మద్దతుగా లోకసభలో మాట్లాడిన బిజెపి నేత సుష్మా స్వరాజ్‌కు ఆయన అభినందనలు తెలిపారు.

కావూరి సాంబశివ రావు ప్రకటన తర్వాతనైనా రాజీనామా చేయని తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆత్మగౌరవం కాపాడుకుని రాజీనామా చేయాలని కెటి రామారావు అన్నారు. రాజీనామాలను స్పీకర్ ఎన్నిసార్లు తిరస్కరిస్తే అన్ని సార్లు రాజీనామాలు చేయాలని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసే సత్తా ఈ ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయం కావాలన్న చిదంబరం ప్రకటనను ఆయన తప్పు పట్టారు. ఏ అంశం మీద కూడా ఏకాభిప్రాయం రాదని, మెజారిటీ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం శాసనసభ్యులు మళ్లీ రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 14ఎఫ్ తొలగింపునకు ముఖ్యమంత్రి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+