అమెరికాలోని కొలంబస్‌లో తెలుగు వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాదులోని అతని కుటుంబ సభ్యులు చాలా రోజులుగా ప్రశాంత్ రెడ్డితో మాట్లాడడానికి ప్రయత్నించారు. కానీ సమాధానం లభించలేదు. దీంతో వారు చికాగోలోని ఓ మిత్రుడిని సంప్రదించారు. అతను ఆటా సహాయం తీసుకున్నాడు. ఆటా ప్రతినిధులు పోలీసులకు చెప్పడంతో వారు అపార్డుమెంటును తెరిచి చూసే సరికి ప్రశాంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. ఓ స్యూసైడ్ నోట్ కూడా రాశాడు. అందులోని వివరాలు తెలియడం లేదు.
ప్రశాంత్ రెడ్డి కుమ్మిన్స్‌లో పనిచేసేవాడు. కొద్ది వారాల క్రితం ఉద్యోగాన్ని వదిలేశాడు. అతనికి హెచ్1బి వీసా ఉంది. అతని మృతదేహాన్ని ఫ్యునెరల్ హోమ్‌కు అప్పగించారు. లాంఛనాలు పూర్తి చేసి, ప్రశాంత్ మృతదేహాన్ని హైదరాబాదు పంపేందుకు ఆటా ఏర్పాట్లు చేసింది. ఆటా చికాగో యాక్షన్ టీమ్ అందుకు కృషి చేస్తోందని ఆటా మీడియా చైర్ హరిప్రసాద్ రెడ్డి లింగాల చెప్పారు.












Click it and Unblock the Notifications