విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టు తీర్పుపై లగడపాటికి వల్లభనేని వంశీ ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vallabhaneni Vamsi
విజయవాడ: కృష్ణా జిల్లా నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వంశీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ను గురువారం మరోసారి టార్గెట్ చేశారు. వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన కంపెనీలలో తాను ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని గతంలో లగడపాటి చెప్పారని అయితే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు మాత్రం లగడపాటికి సంబంధించిన కంపెనీలు రూ.50 కోట్ల మేర జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాయని తీర్పు చెప్పిందని అన్నారు. దీనిపై లగడపాటి విజయవాడ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

లగడపాటి చిలక జోస్యం ఎవరూ చెప్పరని అన్నారు. తన నియోజకవర్గ ప్రజలకు లగడపాటి ఇప్పటి వరకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండు చేశారు. రావాల్సిన నిధులను కాంగ్రెసు నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు. బందు ప్రశాంతంగా జరుగుతుంటే పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కాగా జగన్ తన అవినీతి బయటపడటంతో భారం దేవుడిపై వేశారని మరో నేత పయ్యావుల కేశవ్ వేరుగా అన్నారు. దేవుడు ఉన్నాడు కాబట్టే జగన్ అవినీతి, అక్రమాలు ఒక్కోటి బయట పడుతున్నాయని అన్నారు.

English summary
TDP leader Vallabhaneni Vamsi targeted again Vijayawada MP Lagadapati Rajagopal today. He questioned Lagadapati about his money in Jagan's institutes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X