వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీహార్ జైలులో కల్మాడీ వార్డులో అన్నా హజారే

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బెయిల్ తీసుకోవడానికి నిరాకరించడంతో సామాజిక కార్యకర్త అన్నాహజారేను తీహార్ జైలుకు తరలించారు. ఆయనతో పాటు ఆయన ఏడుగురు అనుచరులను కూడా జైలుకు తరలించారు. బెయిల్ కోసం లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని కోర్టు చేసిన సూచనను అన్నా హజారే తిరస్కరించారు. దీంతో అన్నా హజారేకు, ఆయన అనుచరులకు ఏడు రోజుల పాటు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో వారిని తీహార్ జైలుకు తరలించారు. అన్నా హజారేను, ఆయన అనుచరులను అరెస్టు చేయడం మినహా మరో మార్గాంతరం కనిపించలేదని ఢిల్లీ పోలీసులు అన్నారు. ఇప్పటి వరకు తాము 1400 మందిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. కాగా, అన్నా హజారే అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబుకాయి.

కాగా, అన్నా హజారేను కామన్ వెల్త్ కుంభకోణం కేసులో అరెస్టయిన సురేష్ కల్మాడీని ఉంచిన తీహార్ జైలులోని నాలుగో వార్డులో ఉంచినట్లు సమాచారం. హజారే అనుచరులు అరవింద్ కేజ్రివాల్, కిరణ్ బేడీలతో పాటు ఆరుగురిని 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి ఎ. రాజాను ఉంచిన ఒకటో వార్డులో ఉంచినట్లు తెలుస్తోంది. అవినీతిపై పోరాటం చేస్తున్నవారికీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కున్నవారికి జైలులో సమన్యాయం చూపారని భావించవచ్చునని దీనిపై వ్యాఖ్యానిస్తున్నారు.

జన్ లోక్‌పాల్ బిల్లు కోసం ఢిల్లీలోని జయప్రకాష్ నారాయణ్ పార్కులో నిరాహార దీక్ష తలపెట్టిన సామాజిక కార్యకర్త అన్నా హజారేను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. అన్నా టీం సభ్యులు కేజ్రీవాల్, కిరణ్ బేడీలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాన్ని ఆపేది లేదని అన్నా హజారే అన్నారు. నిరసనకారులు సహనం వహించి, శాంతి పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సీనియర్ పోలీసు అధికారులు ఉదయమే అన్నా హజారే వద్దకు వచ్చి గృహనిర్బంధం విధించినట్లు చెప్పారు. ఇల్లు వదిలి బయటకు రావద్దని ఆదేశించారు. పోలీసులను ఎదుర్కుని ముందుకు సాగడానికి ప్రయత్నించినప్పుడు హజారేతో పాటు కిరణ్ బేడీ, కేజ్రీవాల్‌, తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. తన అరెస్టు ద్వారా మరో స్వాతంత్ర్యోద్యమం ప్రారంభమైందని అన్నా హజారే అన్నారు.

English summary
Anna Hazare and his supporters were sent to Tihar Jail today, they rejected to give written agreement on fast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X