వైయస్ జగన్‌పై కథ: శంకరావు యాక్షన్, డిఎల్ స్క్రిప్టు

జగన్‌పై హైకోర్టుకు లేఖ రాయడానికి ముందు శంకరరావు రహస్యంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరాన్ని, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారని చెబుతున్నారు. అప్పటికే డిఎల్ రవీంద్రా రెడ్డి వైయస్ జగన్ ఆస్తులపై తయారు చేసిన లేఖను తన వద్ద పెట్టుకున్నారని చెబుతున్నారు. దాన్ని అధిష్టానం పెద్దలకు చూపించి అనుమతి పొందారని అంటారు. జగన్‌పై డిఎల్ రవీంద్రా రెడ్డి రాసిన కథను, స్క్రిప్టును లేఖ రూపంలో హైకోర్టుకు పంపించారని అంటున్నారు.
తాజాగా, శంకరరావు మరో బాంబు కూడా పేల్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసినవారిని కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో వైయస్ మంత్రివర్గంలో పనిచేసిన చాలా మంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి శంకరరావును, డిఎల్ రవీంద్రా రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. దాంతో వారిద్దరిపై విచారణ జరిగే అవకాశాలు లేవు. శంకరరావు చేసిన ఆ ప్రకటన వెనక కూడా డిఎల్ రవీంద్రా రెడ్డి ఉన్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications
