హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాక్షి డైలీ ఆఫీసులో సిబిఐ అధికారుల సోదాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sakshi Daily
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక కార్యాలయంలో కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సిబిఐ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు. కంప్యూటర్ హార్డ్ డిస్కుల్లోని సమాచారాన్ని కూడా వారు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. సిబిఐ అధికారులు మాత్రం నోరు విప్పడం లేదు.

సాక్షి వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి నివాసంలోనూ సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సాక్షి మీడియాలో ఆయనే కీలకమని భావిస్తున్నారు. సాక్షి సిఇవో సజ్జల రామకృష్ణా రెడ్డిని, విజయసాయి రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. జగతి పబ్లికేషన్స్ తరఫున సాక్షి డైలీ నడుస్తోంది. జగన్‌కు చెందిన సాక్షి టీవీ చానెల్, సాక్షి దినపత్రికల్లోకి పెద్ద యెత్తున పెట్టుబడులు వచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ సంస్థల్లోకి పెట్టుబడులు ఎలా వచ్చాయనే విషయంపై అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

English summary
CBI officers are conducting searches in YSR Congress president YS Jagan's Sakshi media office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X