సిబిఐ దాడులు: ముఖ్యమంత్రిని కలిసిన జగన్ వర్గం

నాటి మంత్రివర్గంలో ఉన్నందుకు సిబిఐ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని బాలినేని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. కాగా బాలినేని వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో గనులు, భూగర్భ శాఖ మంత్రి పదవిని నిర్వహించారు. వైయస్ మృతి అనంతరం ఆయన జగన్ వెంట వెళ్లారు. అధిష్టానం హెచ్చరించినప్పటికీ ఆయన తగ్గలేదు. గురువారం జగన్ ఆస్తులపై సిబిఐ దాడులు నిర్వహిస్తుందని తెలియగానే ఆయన హుటాహుటినా జగన్ ఇంటికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications