టెక్‌లో సత్యం విలీనమైతే ఆసియాలోనే భారీ ఐటీ కంపెనీ
Technology
oi-Nageshwara Rao M
By Nageswara Rao
హైదరాబాద్: టెక్ మహీంద్రా, మహీంద్రా సత్యం కంపెనీలు విలీనమైతే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారీ ఐటీ కంపెనీ అవతరిస్తుందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) తెలి పింది. అలా అవతరించే కంపెనీ భారత్‌లోనే కాకుండా, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కూడా ప్రధాన ఐటీ కంపెనీలకు గట్టిపోటీనిస్తుందని పేర్కొంది. ఈ రెండు కంపెనీలు కలసి పనిచేయడం మంచి ఫలితాలనిచ్చిందని వివరించింది. దీనివల్లే గత ఏడాది మహీంద్రా సత్యం కంపెనీకి 10 మంది కొత్త క్లయింట్లు లభించారని- ఐడీసీ వివరించింది. గత నెల 8న జరిగిన మహీంద్రా సత్యం విశ్లేషకుల సమావేశంలో జరిగిన చర్చలు, ప్రజంటేషన్లు ఆధారంగా, మార్కెట్ ఇంటెలి జెన్స్, అడ్వైజరీ సర్వీసులందజేసే ఐడీసీ రూపొందించిన నివేదిక ఈ వివరాలు తెలిపింది.
The merger entity of Tech Mahindra and Mahindra Satyam may emerge as a formidable competitive force in the Asia-Pacific region, especially for Indian IT service providers and other regional players, according to International Data Corporation (IDC).