చిరంజీవి 150వ చిత్రం మళ్లీ వెనక్కి పోతుందా?

రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే చిరంజీవి రాజకీయాల్లో మళ్లీ బిజీ కావాల్సి ఉంటుంది. ఉప ఎన్నికల్లో ప్రచార బాధ్యతను కాంగ్రెసు అధిష్టానం చిరంజీవికి అప్పగించే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఆయన 150వ చిత్ర నిర్మాణం మళ్లీ వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు చిరంజీవి చిత్రానికి అటంకాలు ఏర్పడుతుండడంతో అబిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు, అప్పుడు అంటూ ప్రజారాజ్యం పార్టీ స్థాపన మాదిరిగానే చిరంజీవి 150వ చిత్ర నిర్మాణ వ్యవహారం కూడా మారిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications