కాంగ్రెసులో మూడో పవర్ సెంటర్‌గా చిరంజీవి

రాష్ట్ర స్థాయిలో ఏర్పాటయ్యే కాంగ్రెసు కోర్ కమిటీలో చిరంజీవికి స్థానం కల్పించబోతున్నారు. అయితే, పార్టీ నాయకుడిగా చిరంజీవికి పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో ఆయనకు ప్రత్యేకంగా ఓ గది కేటాయించే అవకాశం లేదు. తనను కలుసుకోవడానికి వచ్చే కాంగ్రెసు కార్యకర్తలకు, తన వర్గానికి అందుబాటులో ఉంటూ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఓ కార్యాలయం అవసరమని, వారికి నిర్ణీత సమయాల్లో అందుబాటులో ఉండాలని, అప్పుడే కాంగ్రెసు రాజకీయాల్లో రాణిస్తామని చిరంజీవి భావించి గత ప్రజారాజ్యం పార్టీ కార్యాలయాన్ని తన వ్యక్తిగత కార్యాలయంగా తీర్చిదిద్దుకుంటున్నారు.
కాంగ్రెసులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రెండు అధికార కేంద్రాలుగా ఉన్నారు. తమ తమ వర్గాలకు అందుబాటులో ఉంటూ పరస్పరం పైచేయి సాధించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక వారికి చిరంజీవి కూడా పోటీకి రానున్నారు.












Click it and Unblock the Notifications