పదిమంది జగన్ ఎమ్మెల్యేలు వెనక్కి: డిఎల్

DL Ravindra Reddy
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పలువురు శాసనసభ్యులతో బలవంతంగా రాజీనామాలు చేయించారని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి శుక్రవారం ఆరోపించారు. జగన్‌కు మద్దతుగా రాజీనామా చేసిన వారిలో పది మంది శాసనసభ్యుల వరకు వెనక్కి వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికే జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించాడని విమర్శించారు. వ్యక్తులతో పార్టీలు ఎక్కువ కాలం నడవవన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి లేని లోటు తీర్చలేనిదని మంత్రి దానం నాగేందర్ వేరుగా అన్నారు. బంజారాహిల్సులోని వైయస్సార్ విగ్రహానికి పిసిసి చీఫ్ బొత్స, దానం నాగేందర్, కెవిపి రామచంద్ర రావులు శుక్రవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దానం మాట్లాడారు. ప్రజల కోసం వైయస్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. అవన్నీ కొనసాగించేందుకు ప్రయత్నిస్తామన్నారు. వైయస్ బొమ్మతో పాటు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా బొమ్మను సైతం పెట్టుకొని గెలిచినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+