వైయస్ జగన్ ఆస్తుల కేసుపై ఈడి కసరత్తు!

సమాచారం. సిబిఐ నుండి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్, ఎమ్మార్ కేసుల విషయంలో తమ విచారణకు సంబంధించి శుక్రవారం మీడియాకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లోకి నిధులు ఎలా వచ్చాయి? ఎక్కడి నుండి వచ్చాయి? తదితర అంశాలపై ఈడి దృష్టి సారించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులలోని నిందితులకు ఈడి త్వరలో నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా సిబిఐ అధికారులు శుక్రవారం జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డితో సహా మరో ఇద్దరికి నోటీసులు జారీ చేశారు. అధికారులు జగన్, ఎమ్మార్ కేసుల విషయంలో సచివాలయంలోని ఫైళ్లను పరిశీలిస్తున్నారు.
కాగా ఎమ్మార్ కేసులో స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు శుక్రవారం నిరాకరించింది. కేసుతో సంబంధం ఉన్న సిబిఐ, మంత్రి శంకర్ రావుతో సహా పలువురికి నోటీసులు జారీ చేసింది. కాగా కేసును వారం రోజుల పాటు వాయిదా వేసింది. నోటీసులు పంపిన వారు వారం రోజులలో తమ సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications