జగన్ వర్గం రాజీనామాలతో సమస్య లేదు: తులసి రెడ్డి

జగన్ ఢిల్లీ వెళ్లి జాతీయ పార్టీల నేతలను కలవడం కంటే సిబిఐ దర్యాఫ్తుకు సహకరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటే బావుంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ఆస్తులు ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ శాసనసభ్యుడు గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు శుభ పరిణామం అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో 100 శాతం ఫీజు రీయింబర్సుమెంట్సు అందజేస్తున్నామని మంత్రి పితాని సత్యనారాయణ తిరుపతిలో అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో కొత్తగా 549 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. త్వరలో ఉన్నత పదవుల భర్తీ సైతం ఉంటుందన్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు నేరుగా పౌరసరఫరా శాఖ నుండే నిత్యావసర వస్తువులు అందేలా కృషి చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications