వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్పత్రి వద్ద రాహుల్ గాంధీకి క్షతగాత్రుల చుక్కెదురు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
న్యూఢిల్లీ: ఢిల్లీ బాంబు పేలుడులో గాయపడినవారిని పరామర్శించడానికి వచ్చిన కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీకి బుధవారం ఆస్పత్రి వద్ద చేదు అనుభవం ఎదురైంది. గాయపడినవారి బంధువులు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ వ్యక్తి రాహుల్ వైపు రాయి విసిరినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఏ మేరకు నిజం ఉందనేది నిరూపితం కాలేదు. ఉగ్రవాదులను అరికట్టడంలో కాంగ్రెసు ప్రభుత్వం విఫలమైందనే ఆగ్రహం స్థానికుల్లో ఉంది. ఆ ఆగ్రహమే రాహుల్ గాంధీ వచ్చినప్పుడు వ్యక్తమైందని అంటున్నారు.

కాగా, ఢిల్లీ పేలుళ్లకు తామే బాధ్యులమంటూ హుజీ ప్రకటించుకుంది. ఈ మేరకు హుజీ కొన్ని మీడియా కార్యాలయాలకు సమాచారం అందించింది. ఢిల్లీ బాంబు పేలుడులో 12 మంది మరణించారు. గాయపడినవారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉగ్రవాద దాడులను ఆపలేమని రాహుల్ గతంలో చేసిన ప్రకటనను బాధితులు గుర్తు చేసుకున్నారు. అఫ్జల్ గురును విడుదల చేయాలని, లేదంటే మరిన్ని దాడులు చేస్తామని హుజీ హెచ్చరించింది.

English summary
AICC general secretary Rahul Gandhi faced opposition from victims of Delhi bomb blast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X