లగడపాటి శ్రీధర్ కార్యాలయంలో సిబిఐ సోదాలు

వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో విజయలక్ష్మీ మినరల్స్, భారతి సిమెంట్స్ ప్రతినిధులు కూడా గురువారం సిబిఐ ముందు హాజరయ్యారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ఇప్పటి వరకు తాము 14 మందిని విచారించినట్లు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ కేసులో విల్లాలు కొన్న 86 మందికి నోటీసులు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. సినీ ప్రముఖులు మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్, రామ్ చరణ్ తేజలతో పాటు పలువురికి నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో 95 శాతం పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.
ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో విల్లాలు కొనుగోలు చేసినవారిని ఈ నెల 14 తేదీ నుంచి రోజుకు 8 మంది చొప్పున విచారిస్తామని ఆయన చెప్పారు. రాజకీయ నాయకులు డి. శ్రీనివాస్ రెడ్డి, గీతా రెడ్డి, దామోదర్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. కాగా, విల్లాలు కొనుగోలు చేసిన మహిళా విఐపిలను వారి ఇంటికి వెళ్లి విచారించాలని సిబిఐ నిర్ణయించుకుంది.












Click it and Unblock the Notifications