న్యూఢిల్లీ: ఉగ్రవాద దాడితో బుధవారం పగలు వణికిపోయిన ఢిల్లీ రాత్రి భూకంపంతో వణికిపోయింది. బుధవారం రాత్రి 11 గంటల20 నిమిషాల ప్రాంతంలో ఐదారు సెకండ్ల పాటు ఢిల్లీలో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. రెక్టర్ స్కేలుపై 4.2గా ఈ భూకంపం నమోదైంది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
భూకంపం వల్ల ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ సంభవించలేదు. ఢిల్లీ పరిసరాల్లో ఘజియాబాద్, నోయిడా వంటి ప్రాంతాల్లో కూడా భూకంపం ప్రభావం కనిపించింది. భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
A strong tremor lasting 5-6 seconds shook the capital at 11.28pm on Wednesday, forcing residents to run out of their houses in various parts of the city.