బ్రాహ్మణి ప్లాట్: బాలయ్య మీదికి నెట్టిన చంద్రబాబు

ఎమ్మార్ ప్రాపర్టీస్‌తో తమ ప్రభుత్వ హయాంలోనే అవగహనా ఒప్పందం (ఎంఒయు) కుదిరిందని, భూకేటాయింపులు మాత్రం వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగాయని ఆయన అన్నారు. తాము ఓ మంచి ఉద్దేశంతో ఎమ్మార్ ప్రాపర్టీస్‌ను ప్రారంభిస్తే దాన్ని కాంగ్రెసు ప్రభుత్వం కుంభకోణాల పుట్టగా మార్చిందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన మరోసారి విరుచుకుపడ్డారు.
చేతిలో పత్రిక ఉంది కదా అని అవాస్తవాలు రాయడం మంచిది కాదని ఆయన వైయస్ జగన్‌కు సూచించారు. వైయస్ జగన్ పెద్ద పెద్ద మాటలు చెప్పి చివరికి కాంగ్రెసుకు సరెండరయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కమ్మక్కయ్యాయని విమర్శించిన జగన్ కాంగ్రెసుతో లాలూచీ పడ్డారని ఆయన విమర్శించారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఒబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) అక్రమాలపై పోరాటం చేస్తే నవ్వుకున్నారని, ఇప్పుడు పాపం పండిందని ఆయన అన్నారు. రాజకీయ నేతలు ఆస్తులు ప్రకటిస్తేనే విశ్వసనీయత పెరుగుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications