వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోశయ్యకు క్లీన్‌చిట్‌పై ఎసిబి మీద కోర్టు ఆగ్రహం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rossaiah
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు ప్రస్తుత గవర్నర్ కె. రోశయ్యకు హైదరాబాదులోని అమీర్‌పేట భూ కుంభకోణం కేసులో క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై కోర్టు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రోశయ్యకు క్లీన్‌చిట్ ఇవ్వడంపై న్యాయవాది శ్రీరంగారావు మళ్లీ కోర్టుకెక్కారు. ఏ ఆధారాలతో రోశయ్యకు క్లీన్‌చిట్ ఇచ్చారని ఎసిబి కోర్టు ప్రశ్నించింది. అందుకు సంబంధించిన పత్రాలను ప్రతివాదులకు కూడా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కేసు విచారణ ఈ నెల 26వ తేదీకి వాయిదా పడింది.

తక్కువ ధరకు అత్యంత విలువైన భూములను తమ సన్నిహితులకు కట్టబెట్టారని శ్రీరంగారావు రోశయ్యపై, మరో 14 మందిపై ఎసిబి కోర్టుకు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ జరిపిన ఎసిబి రోశయ్యకు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆ కేసులో క్లీన్‌చిట్ లభించిన తర్వాత రోశయ్య తమిళనాడు గవర్నరుగా నియమితులయ్యారు.

English summary
Court expressed anguish at ACB for giving clean chit to Tamilnadu governor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X