అహ్మదాబాద్ టార్గెట్ అంటూ మూడో టెర్రర్ మెయిల్

మూడో ఇ - మెయిల్ మీడియా సంస్థలకు వచ్చింది. యాహూ ఖాతా నుంచి ఈ మెయిల్ పంపారు. మూడో టెర్రర్ మెయిల్ వచ్చిన విషయాన్ని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం కూడా ధ్రువీకరించారు. మూడో మెయిల్‌కు సంబంధించిన వివరాలను అందించాలని ప్రభుత్వం యాహూను కోరింది. రెండో ఇ - మెయిల్ చోటూ పేరుతో వచ్చింది. దర్యాప్తులో తాము ఐటి శాఖ సూచనలను పాటిస్తున్నామని చిదంబరం చెప్పారు. భారత్‌ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని చిదంబరం అన్నారు. భారత్‌కు ప్రతి రోజూ ముప్పు ఉందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఢిల్లీ పేలుడులో 13 మంది మరణించినట్లు, 48 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications