హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపితో కలిసి పని చేస్తాం: తెరాస ఎమ్మెల్యే హరీష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజా ప్రతినిధులు తెలంగాణ కోసం రాజీనామాలు చేస్తే వారితో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు గురువారం అన్నారు. పదవులకు దూరంగా ఉండాలన్న టిడిపి నేతలకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే వారు ముందుగా తమ రాజీనామాలు ఆమోదింప చేసుకోవాలన్నారు. అలా చేస్తే వారి ఏ సవాళ్లనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణపై ఇప్పటికీ టిడిపి వైఖరి స్పష్టంగా లేదన్నారు. టిడిపి ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి తనపై చేసిన కాంట్రాక్టు ఆరోపణలు అవాస్తవమన్నారు. కొత్తకోట తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయల నుండి తప్పుకుంటానని సవాల్ చేశారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు మరోసారి రాజీనామా చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. టిడిపి, కాంగ్రెసు రాజీనామా చేస్తే బాన్సువాడలో పోటీ చేయమన్నారు.

తమ కుటుంబ సభ్యులెవరికీ ఎమ్మార్‌లో విల్లాలు, ఫ్లాట్‌లు లేవన్నారు. ఎమ్మార్ విల్లాలను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకొని వాటిని భూ నిర్వాసితులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్‌లో ప్లాట్లు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ అంటే ఎన్‌కౌంటర్ చేస్తానన్న వరంగల్ జిల్లా రూరల్ డిఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. విద్యార్థులను చితకబాదిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రిని కలవడం ఎమ్మెల్యేల ప్రాథమిక విధి అన్నారు. తాను కిరణ్ కుమార్ రెడ్డిని కలవడంలో తప్పులేదన్నారు.

English summary
TRS MLA Harish Rao said today that they are ready to work with Telugudesam if they resign. He condemned Kothakota Dayakar Reddy comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X