వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యే వెంట పడిన మంత్రి

కొత్తపట్నం మండంలోని చింతల గ్రామంలో, దాని పరిసరాల్లో వాళ్లు గత కొన్నేళ్లుగా పెద్ద యెత్తున భూములు కొనుగోలు చేశారు. విమానాశ్రయం ఏర్పాటుకు, వాన్‌పిక్ సెజ్‌లో పరిశ్రమల స్థాపనకు అప్పటికే ప్రభుత్వం పెద్ద యెత్తున కొనుగోలు చేసింది. దాంతో ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరిగాయి. ఒంగోలుకు 8 కిలోమీటర్ల దూరంలో గల చింతల దాని చుట్టుపక్కల బాలినేని 500 ఎకరాలు, అరుణమ్మ వంద ఎకరాలు భూములు కొనుగోలు చేసినట్లు సమాచారం. అది మంత్రికి లక్ష్యంగా మారింది. చింతలలోని 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒంగోలుకు చెందిన చెత్తను వేయడానికి అత్యాధునాతన డంపింగ్ యార్డు ఏర్పాటుకు కేటాయించాలని మంత్రి మహీధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
బాలినేని, ఇతర వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల భూముల మధ్యలో డంపింగ్ యార్డు వస్తుండడంతో భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో అక్కడ పెద్ద యెత్తున భూముల కొనుగోలుకు రైతులకు బకాయిలు పెట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల దిమ్మ తిరిగింది. వాన్‌పిక్ సెజ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన రాక ముందు 50 వేలకు ఎకరం చొప్పున కొంటే ఆ తర్వాత 3 కోట్ల రూపాయలకు ధర పెరిగింది. మంత్రి ప్రకటనతో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలింది.












Click it and Unblock the Notifications