ఎమ్మెల్యేలు రండి, జగన్ మాత్రం వద్దు: వీర శివా రెడ్డి

జగన్ వర్గం 26 మంది ఎమ్మెల్యేలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. వారి మనసంతా కాంగ్రెసు వైపే ఉందన్నారు. జగన్ ఢిల్లీ టూర్ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. ఢిల్లీ టూర్ కారణంగా జగన్ వ్యక్తిత్వం దెబ్బతిన్నదన్నారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన జగన్ ఇప్పుడు పూర్తిగా విశ్వసనీయత కోల్పోయారన్నారు. బ్రాహ్మిణి భూములు మరో పారిశ్రామికవేత్తకు అప్పగించాలని వీరశివా సూచించారు. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్ దేశాన్ని దోచుకునే పనిలో పడ్డారన్నారు. అందుకే కేంద్రంలో వ్యవసాయ, రైల్వే శాఖలను తెచ్చుకునేలా ఎంపీ సీట్లు గెలవాలనుకుంటున్నాడని విమర్శించారు. తాను దోచుకోవడానికి జగన్ ప్రధాని సీటు కూడా కావాలంటాడేమో అన్నారు. జగన్ అవినీతి మకిలి తమకు అంటుకుంటుందని జాతీయ నేతలు ఆయనను కలవడానికి విముఖత చూపారన్నారు.












Click it and Unblock the Notifications