గ్యాస్ వినియోగదారులకు HPCL కీలక అప్డేట్..! 30 రోజులే గడువు..!

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్ధ హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (HPCL) తమ ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ఇవాళ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటివరకూ ఎల్పీజీ కనెక్షన్ కొనసాగిస్తూ, కొత్తగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్ కూడా తీసుకుంటే వారికి ఇది వర్తిస్తుంది. ఈ రెండు కనెక్షన్లు కలిగిన వారికి 30 గడువుల గడువుతో హెచ్పీసీఎల్ తాజా నిబంధన ఒకటి తెచ్చింది. దీన్ని కచ్చితంగా అమలు చేయబోతోంది.

ఎల్‌పిజి మరియు పిఎన్‌జి కనెక్షన్లు రెండూ ఉన్న ఇళ్లకు ముఖ్యమైన అప్డేట్ అంటూ ఇవాళ ఎక్స్ లో హెచ్పీసీఎల్ ఓ ట్వీట్ పెట్టింది. ఇందులో ప్రభుత్వం సవరించిన ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (సరఫరా మరియు పంపిణీ నియంత్రణ) ఉత్తర్వు, 2026 ప్రకారం, పిఎన్‌జి కనెక్షన్లను ఏర్పాటు చేసుకున్న గృహాలు రాయితీతో కూడిన గృహ వినియోగ ఎల్‌పిజి సిలిండర్ల సాధారణ వాడకాన్ని కొనసాగించలేవని తేల్చేసింది.

HPCL Issues Urgent Notice LPG-PNG Double Benefit Days Are Over Act Within 30 Days

పిఎన్‌జి కనెక్షన్ పొందిన 30 రోజులలోపు, వినియోగదారులు ఈ క్రింది వాటిలో ఏదో ఒకటి చేయవలసి ఉంటుందని రెండు అంశాల్ని వెల్లడించింది. ఇందులో ఒకటి ఎల్‌పిజి కనెక్షన్‌ను సరెండర్ చేయడం/రద్దు చేయడం, లేదా పిఎన్‌జి లేని ప్రాంతాలలో భవిష్యత్ ఉపయోగం కోసం ఎల్‌పిజి కనెక్షన్‌ను అందుబాటులో ఉంచుకోవడానికి బదిలీ వోచర్‌ను ఎంచుకోవడం. ఈ కొత్త మార్గదర్శకాలు 25 మే 2026 నుండి అమలులోకి వచ్చినట్లు హెచ్పీసీఎల్ తెలిపింది. సులభమైన, పారదర్శకమైన పంపిణీ పద్ధతుల కోసం పౌరులు ఈ సవరించిన నిబంధనల గురించి తెలుసుకుని, వాటిని పాటించాలని కంపెనీ కోరుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+