జగన్‌కు షాక్: సిఎం సభలో ఎమ్మెల్యే, కనిపించని జెసి

కాగా గత కొంతకాలంగా గుర్నాథ్ రెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గంలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల వైయస్సార్ పేరు సిబిఐ ఎఫ్ఐఆర్‌లో ఉందన్న కారణంతో రాజీనామా చేసిన 26 మంది ఎమ్మెల్యేలలో గుర్నాథ్ రెడ్డి కూడా ఒకరు. అయితే కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టు, జగన్‌కు ఢిల్లీలో ఓదార్పు లభించక పోవడం మరోవైపు సిబిఐ జగన్ ఆస్తులపై దర్యాఫ్తు వేగవంతం చేయడం తదితర పరిణామాల దృష్ట్యా గుర్నాథ్ రెడ్డి జగన్‌కు మద్దతు పలకడంపై వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. కాగా గుర్నాథ్ రెడ్డి దారిలోనే మరికొందరు ఎమ్మెల్యేలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications