గాలి జనార్ధన్ రెడ్డి వ్యూహానికి వైయస్ చెక్!

YS Rajasekhar Reddy
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఇటీవల కటకటాల పాలైన కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ శాసనసభ్యుడు గాలి జనార్ధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఆరంగేట్ర వ్యూహాలకు గతంలో చెక్ చెప్పారా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఆంధ్ర ప్రదేశ్‌లో మైనింగ్ కార్యకలాపాలు చేపట్టిన గాలి జనార్ధన్ రెడ్డి ఆ తర్వాత 2004 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ నుండి పోటీ చేయాలని నిశ్చయించుకున్నాడట. అప్పటికే కర్నాటకలోని బళ్లారి జిల్లాలో తమ ప్రాబల్యం పెంచుకున్న గాలి జనార్ధన్ రెడ్డి 2004 ఎన్నికల్లో ఎపిలోనూ తమ ప్రాబల్యం పెంచుకోవాలని చూశాడట. అందులో భాగంగా కర్నాటక రాజకీయాలు మీరు చూసుకోండి, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి నేను వెళతానని తన సోదరులకు కూడా సూచనలు చేసినట్టు సమాచారం. ఈ మేరకు ఓ ప్రముఖ దినపత్రికలో వార్తాకథనం ప్రచురితమైంది.

అటు కర్నాటకలో ఇటు ఆంధ్రాలో రాజకీయంగా పాగా వేయడం ద్వారా బళ్లారి నుండి కర్నూలు జిల్లా వరకు మైనింగ్ కార్యకలాపాలకు తనకు ఎదురు లేకుండా ఉంటుందనే భావనతోనే ఆయన ఎపి రాజకీయాలలోకి రావానే నిర్ణయానికి వచ్చినట్లుగా పలువురు భావించారు. అనుకున్నదే తడవుకు దివంగత వైయస్‌తో అనుబంధం కారణంగా నంద్యాల నుండి పోటీ చేస్తానని చెప్పారట. అయితే దానికి వైయస్ ససేమీరా అన్నారని సమాచారం. ఆ తర్వాత వైయస్ కుటుంబంతో అనుబంధం మరింత పెరిగి పోయింది. 2009 ఎన్నికల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట. నంద్యాల నుండి పోటీ చేయాలని భావించిన గాలి ఆ పార్లమెంటు నియోజకవర్గంలో నేతలందరితో పలు దఫాలుకా చర్చలు కూడా జరిపారట. ఎంపీ స్థానానికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారట. అయితే అప్పుడు కూడా వైయస్ గాలి కోరికను సున్నితంగా తిరస్కరించారట. దీంతో గాలి పూర్తిగా కన్నడ రాజకీయాలకే పరిమితం అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+