వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒరిస్సా వరదలకు 22 మంది బలి, తీవ్ర ఆస్తి నష్టం

By Pratap
|
Google Oneindia TeluguNews

Orrisa
భువనేశ్వర్: వరద తాకిడికి ఒరిస్సా రాష్ట్రం తల్లడిల్లిపోయింది. తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. వరదలకు 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వరద తాకిడికి 2600 గ్రామాలు గురయ్యాయి. 14 లక్షల మందికి పైగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. వరద ఉధృతి వల్ల సహాయ చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయి. కటక్,త పూరి, కేంద్రపారా, జైపూర్, సాంబల్పూర్ జిల్లాలు వరద తాకిడికి విలవిలలాడుతున్నాయి.

సహాయక చర్యల కోసం ఒరిస్సా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్, రెండు వైమానిక హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతంలోని దాదాపు 61 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కటక్ సమీపంలో ముందాలి నుంచి మహానందికి 13.66 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. వరద బాధితులకు సహాయం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. నష్టం అంచనా తర్వాత కేంద్రాన్ని సహాయం కోరుతామని ఆయన చెప్పారు.

English summary
Orissa has been hit by the worst instance of floods causing massive devastation including the loss of precious lives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X