గాలి జనార్ధన్ అంటే అందరికీ భయం: సిబిఐ న్యాయవాది

అక్రమ మైనింగులో అధికారుల పాత్ర ఉందని సిబిఐ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారని అయితే వారినెందుకు అరెస్టు చేయలేదని గాలి జనార్ధన్ రెడ్డి తరఫు న్యాయవాది ఉదయ్ లలిత్ ప్రశ్నించారు. సరిహద్దు వివాదం పెండింగులో ఉన్నప్పుడు అక్రమ మైనింగ్ అని ఎలా చెప్పగలరన్నారు. సిబిఐ ఎఫ్ఐఆర్ మొత్తం తప్పుల తడక అన్నారు. అధికారులను అరెస్టు చేయకుండా కేసు ముందుకు సాగే అవకాశం లేదన్నారు. కాగా గాలిని తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోరగా, గాలి జనార్ధన్ రెడ్డి బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం వాదనలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications