ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వర్గం రాజీనామాలకు వ్యతిరేకం: నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narayana
ఒంగోలు: అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి చేసే రాజీనామాలను తాము వ్యతిరేకిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సోమవారం ప్రకాశం జిల్లాలో అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతికి మద్దతుగా రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు.

రాష్ట్రంలోని భూమి రాజకీయ మాఫియా చేతుల్లో ఉందన్నారు. పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి భూములు తీసుకొని కంపెనీలు స్థాపించని వారి నుండి ప్రభుత్వం వెంటనే భూములు వెనక్కి తీసుకొని బాధితులకు తిరిగి ఇవ్వాలన్నారు. ఈ నెల 15వ తేది నుండి విజయవాడ నుండి అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఆంధ్ర-కర్నాటకలను నిలువునా దోచుకున్నారన్నారు. రాష్ట్ర కాంగ్రెసు నేతలు క్రిమినల్స్, దద్దమ్మలని ధ్వజమెత్తారు. పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు, మంత్రి టిజి వెంకటేష్ వ్యాఖ్యల వల్ల తెలంగాణ ఉద్యమం బలపడుతుంది తప్ప బలహీనపడదన్నారు. ఉద్యమాన్ని ప్రభుత్వం శాంతిభద్రతల కోణంలో చూడవద్దని సూచించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్నారు.

English summary
CPI state secretary Narayana opposed YSRC Party president YS Jaganmohan Reddy camp MLAs resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X