వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్‌ఫోర్స్ మాజీ మహిళా అధికారి అంజలి ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Anjali Gupta
భోపాల్‌: కోర్ట్‌ మార్షల్‌కు గురైన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ మాజీ అధికారి అంజలీ గుప్తా సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భోపాల్‌లోని రోహిత్‌ నగర్‌ ప్రాంతంలోని బంధువుల ఇంట్లో ఉన్న అంజలి ఆత్మహత్యకు ముందు ఎలాంటి నోట్‌ రాయలేదని పోలీసులు తెలిపారు. భారతీయ వాయుసేనలో ఫ్త్లెయింగ్‌ ఆఫీసర్‌గా పనిచేసిన అంజలీ గుప్తా తనను సీనియర్‌ అధికారులు లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

అయితే ఆమె ఫిర్యాదులన్నీ అసత్యాలని క్రమశిక్షణారాహిత్యం, ఉన్నతాధికారులను ధిక్కరించడం, నిధుల తప్పుడు లెక్కలు తదితర పలు అంశాల్లో ఆమెదే తప్పని నిర్ణయించి భారతీయ వాయు సేన ఫిబ్రవరి 2006లో ఆమెను విధుల నుంచి డిస్మిస్‌ చేసింది. ఐఎఎఫ్‌లో కోర్ట్‌ మార్షల్‌కు గురైన తొలి మహిళా అధికారి అంజలి గుప్తా.

English summary
In a record the Indian Air Force is not proud of, the first woman IAF officer to be court martialed, Anjali Gupta committed suicide in Bhopal. Gupta hanged herself to death at a relatives residence on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X