వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్, గాలి ప్రత్యేక రాయలసీమను కోరుతారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy-YS Jagan
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కలిసి ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు డిమాండును ముందుకు తెస్తారనే భయాలు బిజెపి జాతీయ నాయకత్వంలో ఉన్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. బళ్లారి జిల్లాలతో కలిసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండును వారు ముందుకు తెచ్చే అవకాశం ఉందని ఆ పత్రిక రాసింది. గాలి జనార్దన్ రెడ్డి సోదరులు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని నాలుగైదు జిల్లాల్లో బలంగా ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రాయలసీమ డిమాండును ముందుకు తెస్తారని అంటున్నారు.

గాలి జనార్దన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, మాజీ మంత్రి శ్రీరాములు స్వాభిమాన్ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర ద్వారా ప్రాబల్యం చాటుకుని కొత్త పార్టీని పెట్టే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఆ పత్రిక రాసింది. ఈ స్థితిలో గాలి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని బిజెపి జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి సదానంద గౌడతో పాటు ఈశ్వరప్ప తదితర నాయకులు గాలి జనార్దన్ రెడ్డికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి కేవలం నిందితుడు మాత్రమేనని ఈశ్వరప్ప అన్నారు.

కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి వర్గానికి చెందిన బిజెపి శాసనసభ్యులు 40 మంది ఉన్నారు. తనకు వ్యతిరేకంగా బిజెపి నాయకులు వ్యాఖ్యలు చేస్తే రెడ్డి సోదరులు సదానంద గౌడ ప్రభుత్వాన్ని కూల్చే ప్రమాదం ఉందని బిజెపి నాయకత్వం ఆందోళనకు గురవుతోంది. ఇటీవల బళ్లారిని సందర్శించిన బిజెపి జాతీయాధ్యక్షుడు నితిన్ గడ్కరీ గాలి సోదరులను పొగడ్తలతో ముంచేశారు. తమ ప్రభుత్వాన్ని గాలి సోదరులు పడగొట్టకుండా వారిని మెప్పించే ప్రయత్నమే గడ్కరీ ప్రకటనలోని ఆంతర్యమని అంటున్నారు.

అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతంలో కూడా వైయస్ జగన్‌కు ప్రాబల్యం ఉంది. తెలంగాణ సమస్య పరిష్కారమైతే తెలంగాణలో కూడా జగన్ పుంజుకుంటారనే అంచనా ఉంది. రాయలసీమ సరేసరి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో తనకు తగిన బలం ఉండి, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అంచనాకు వచ్చిన జగన్ ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర డిమాండుకు మద్దతు ఇస్తారా అనేది అనుమానమే.

English summary
The party also fears Y R Jaganmohan Reddy's YSR Congress factor. They feel that Jagan and the Reddys may demand a separate Rayalaseema state which would include some parts of Andhra Pradesh and Bellary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X