తెలంగాణకు 2 నెలల్లో పరిష్కారం: బొత్స సత్యనారాయణ

పిసిస కార్యవర్గాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాదును కోరినట్లు చెప్పారు. ఆజాదుతో జరిగిన భేటీలో తెలంగాణ సమస్య, ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించారని తెలుస్తోంది. కాగా శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ నెల 25న ప్రజారాజ్యం పార్టీ విలీన కార్యక్రమంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పిసిసి, డిసిసి పునర్వ్యవస్థీకరణ, తెలంగాణ అంశం, బాన్సువాడ ఎన్నికలపై ఆయన ప్రధానంగా తన మూడు రోజుల పర్యటనలో అధిష్టానంతో చర్చించారు.












Click it and Unblock the Notifications