హీటెక్కిన తెలంగాణ సమ్మె: అలా వద్దన్న స్వామి

సమ్మె కారణంగా వరుసగా మూడో రోజూ సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచి పోవడంతో అధికారులు ప్రత్యామ్నాయంపై దృష్టి సారించారు. అసెంబ్లీ ప్రధాన ద్వారానికి తాళం వేసిన తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరు టిటిడిపి నేతలు రహదారి పైనే భోజనాలు చేశారు. తెలంగాణ న్యాయవాదులు కాంగ్రెసు పార్టీ రాష్ట్ర కార్యాలయమైన గాంధీ భవనాన్ని ముట్టడించారు. పోలీసులు న్యాయవాదులను అరెస్టు చేశారు. వరంగల్ జిల్లాలో జిల్లా విద్యాధికారి ఒకరు కార్యాలయానికి హాజరవడంతో ఆగ్రహించిన తెలంగాణవాదులు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి ఆయనను బయటకు బలవంతంగా పంపించేసి కార్యాలయానికి తాళం వేశారు. లోపలున్న ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications