అంబటి రాసలీలల కథనం కొత్త మలుపు

అంబటితో తాను ఎన్నడూ మాట్లాడలదేన్నారు. స్వార్థం కోసమే ఆ ఛానల్ తనను వాడుకుందన్నారు. తనను చూపించలేని విధంగా చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అంబటితో అంతకుముందు ఎన్నడూ మాట్లాడింది లేదన్నారు. కేవలం అంబటి రాంబాబును రాజకీయంగా దెబ్బతీయడానికే ఇలాంటి కుట్ర పన్నారన్నారు. అంబటినితాను ఎన్నడూ చూడలేదన్నారు.
తాను చిరంజీవి అభిమానినని, ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తగా పని చేశానన్నారు. పిఆర్పీ కార్యకర్తగా ఉన్న సమయంలో ఆ ఛానల్ చిరుకు వ్యతిరేకంగా ప్రసారం చేసినప్పుడు మహిళలతో వెళ్లి గట్టిగా నిరసన తెలిపానన్నారు. ఆనాటి ఘటనను దృష్టిలో పెట్టుకొని ఆ ఛానల్ ఆ తర్వాత తనను బ్లాక్ మెయిల్ చేసిందని ఆరోపించారు. ఆ ఛానల్‌పై తన నిరసనను దృష్టిలో పెట్టుకొని ఇంటర్నెట్‌లో తన ఫోటోలు పెడతానని బెదిరించారని ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని బెదిరింపులకు కూడా గురి చేశారన్నారు. వారి ఒత్తిడి కారణంగానే అంబటితో నేను తప్పుడుగా మాట్లాడానన్నారు. దయచేసి ఈ వాస్తవాన్ని మీడియా ప్రజలకు వెల్లడించాలని కోరారు.












Click it and Unblock the Notifications