తెలంగాణ లేదంటే హైదరాబాద్ దిగ్బంధం: హరీష్ రావు

తెలంగాణ కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలు ఓర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సింగరేణి కార్మికుల జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. రణానికి సిద్ధమవుతున్నామన్నారు. ప్రయివేటు డ్రైవర్లతో బస్సులను బయటకు తీసుకు రావాలని ప్రభుత్వం చూస్తే ఆ బస్సులు తిరిగి డిపోలకు చేరవని హెచ్చరించారు. తెలంగాణ కోసం ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయకుంటే ఉద్యమం వారి పైకి మళ్లుతుందని అంతకుముందు కాంగ్రెసు, టిడిపి ప్రజాప్రతినిధులను ఆయన హెచ్చరించారు. సకల జనుల సమ్మెలో భాగంగా తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చేపట్టిన రహదారుల దిగ్బంధంలో ఆయన జహీరాబాదులో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications