రాజీనామా చేయకుంటే చీపుర్లతో కొట్టండి: రాములమ్మ

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే తెలంగాణ వస్తుందన్నారు. సకల జనుల సమ్మెను చూసైన కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై స్పందించాలన్నారు. సమ్మెకు స్పందించకుంటే వారిని చితకబాదే రోజులు వస్తాయన్నారు. ఉద్యమ సెగ ఢిల్లీకి తాకుతోందన్నారు. తెలంగాణ వ్యతిరేకులను బయటకు రానివ్వవద్దని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న వారిని ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్టు చేయిస్తోందని ఆరోపించారు. అరెస్టులు జరుగుతుంటే కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు ఎసి గదులకు పరిమితమయ్యారన్నారు. అణిచివేత, అరెస్టులతో తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేరన్నారు.












Click it and Unblock the Notifications