గాలి సతీమణి అరుణ పేర ఉన్న ఆస్తులపై సిబిఐ కన్ను

గాలి అక్రమ మైనింగ్ సుమారు రూ.7500 కోట్లు ఉంటుందని సిబిఐ అంచనా వేస్తోంది. ఈ డబ్బుతో గాలి కోట్లాది రూపాయలు, కిలోల కొద్ది బంగారాన్ని సమకూర్చుకొని ఆస్తిని తన పేరు మీద, కుటుంబం పేరు మీద, బినామీ పేర్ల మీద పెట్టినట్లుగా తెలుస్తోంది. గాలి నోటి నుండి బినామీ కంపెనీల చిట్టా రప్పించడానికి సిబిఐ అధికారులు మరో తొమ్మిది రోజులు గాలిని, శ్రీనివాస్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ కూడా దాఖలు చేశారు. వ్యాపార విస్తరణలో భాగంగా దేశ, విదేశాల్లో గాలి అనేక సంస్థలు స్థాపించినట్లుగా సిబిఐ అధికారులు గుర్తించారు. వివిధ పేర్లతో సంస్థలు నెలకొల్పడంతో పాటు ఖనిజ ఎగుమతులు, గనుల తవ్వకాలకు వివిధ పేర్లతో అనేక సంస్థలు స్థాపించినట్లుగా సిబిఐ అధికారులు అనుమానిస్తున్నారు.
ఇందులోని చాలా వాటిలో జనార్ధన్ రెడ్డి భార్య భాగస్వామిగా ఉన్నట్లు చెబుతున్నారు. చైనా, సింగపూర్ ఎగుమతి సంస్థలు, ఇండోనేషియా, ఆఫ్రికా దేశాలలో ఇనుప గనుల తవ్వకాలకు స్థాపించిన కంపెనీల్లో ఆమెను భాగస్వామిగా చేర్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాలి నుండి వీటికి సమాధానం రాని పక్షంలో వారే నేరుగా రంగంలోకి దిగి తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications