స్వరం మారింది, జగన్ కాంగ్రెసు గూటికే: చంద్రబాబు

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి వంటి వంద మందిని పెంచి పోషించారని ఆరోపించారు. గాలికి ఉన్న ఆస్తులు, బంగారం శ్రీకాళహస్తీశ్వరుడికీ లేవన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త అన్నాహజారే స్ఫూర్తితో అవినీతిపై పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కాంగ్రెసు పార్టీ విచ్చలవిడి అవినీతితనం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అవినీతిని సామాన్యులు పట్టించుకోకుంటే సమాజం నష్టపోతుందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం హయాంలో పుట్టబోయే బిడ్డకూ పన్ను విధించే అవకాశముందన్నారు.
రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. రైతు సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం చేస్తామన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు కేంద్రం అటకెక్కించిందన్నారు. ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చి కేంద్రం ఇప్పుడు సామాన్యుడి నడ్డి విరుస్తున్నారన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు ఎత్తివేస్తామన్నారు. రూ.400 ఉన్న డిఎపి బస్తా ధరను పద్దెనిమిది నెలల్లో రూ.900కు పెంచిందన్నారు. వెనుకబడిన కులాల రైతులకు న్యాయం జరగాలన్నారు.












Click it and Unblock the Notifications