సెంటిమెంటుతో ఆటొద్దు: కెకె ఎదుట రవిశంకర్ ప్రసాద్

సుప్రీం కోర్టు జడ్జి అయి ఉండి జస్టిస్ శ్రీకృష్ణ రహస్య నివేదిక ఇవ్వడం ఏమిటన్నారు. శ్రీకృష్ణ కమిటీని కేంద్రం రాజకీయంగా ఉపయోగించుకుందని ఆరోపించారు. రెండు వారాలుగా సమ్మె ఉధృతంగా జరుగుతున్నప్పటికీ ఒక్క హింసాత్మక సంఘటన చోటు చేసుకోక పోవడం అభినందనీయమన్నారు. తెలంగాణ కోసం జరుగుతున్న మహోద్యమాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేసినప్పుడు స్పీకర్ తిరస్కరించాలి లేదా ఆమోదించాలి. కానీ పెండింగులో పెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు.
2001లోనే కాంగ్రెసు వర్కింగ్ కమిటీలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామని రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు అన్నారు. కేంద్రమంత్రి చిదంబరం వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమంపై మీడియా నిర్లక్ష్యం చూపిస్తోందన్నారు. తెలంగాణ కోసం ప్రశాంతంగా పోరు సాగుతుందన్నారు. సిపిఎం పార్టీ తప్ప రాష్ట్రంలోని అన్ని పార్టీలు తెలంగాణకు మద్దతు పలుకుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications